Site Logo
 

ఆగ్రోస్ గురించి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ( ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ) 05-03-1968 న భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈక్విటీ భాగస్వామ్యంతో స్థాపించబడింది.

ముఖ్య ఉద్ధేశాలు :

  • 1. బుల్డోజర్లు, పొక్లైన్లు, అద్దె ప్రాతిపదికన రైతాంగానికి అందజేసి భూమి అభివృద్ధి పనులు చేపట్టడం.
  • 2. ఆగ్రోస్ సర్వీస్ కేంద్రాల ద్వారా నాణ్యమైన టైర్లు, బ్యాటరీలు, వ్యవసాయ పనిముట్లు ప్రభుత్వశాఖలకు సరఫరా చేయడం.
  • 3. గుంటూరు వర్కుషాపు ద్వారా నీళ్ళ ట్యాంకర్లు, ట్రాక్టరు ట్రైలర్లు, డంపర్ బిన్లు సరఫరా చేయడం.
  • 4. వ్యవసాయ యాంత్రీకరణ పనులు చేపట్టడానికి ఆగ్రోస్ ని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. సకాలంలో టెండర్లు పిలిచి వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల ధరలను పంపిణీదారులకు ఖరారు చేయడం, సర్వీసింగ్ పనులు చేపట్టడం.
  • 5. సబ్సిడీలో పురుగు మందులు, జిప్సం, బయో ప్రొడక్టులు సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది.
  • 6. సబ్సిడీలో చెఱకు సంబంధిత పరికరములను అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది.
  • 7. వ్యవసాయ యంత్రాల ప్రదర్శనా క్షేత్రాలను ప్రతి జిల్లాలో నెలకొల్పి వాటి ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరములను ప్రదర్శన మరియు అద్దె ప్రాతిపదికన రైతాంగానికి అందజేయడం. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, కడప, విజయనగరం, ఏలూరు, నెల్లూరు నందు ప్రదర్శన క్షేత్రాల ఉన్నాయి.
మరింత తెలుసుకోండి
సహాయం కొరకు సంప్రదించండి